ఆకేరు న్యూస్, హదరాబాద్ : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. వచ్చే నెల మే 13న జరగనున్న ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం నుంచి మొత్తం 160 కంపెనీల బలగాలు రానున్నాయి. ఇప్పటికే 60 కంపెనీల కేంద్రం బలగాలు తెలంగాణకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 60 వేల మంది పోలీసులు ఉన్నారు. ఒక్కోకంపెనీలో 60 నుంచి 70 మంది పోలీసులు ఉంటారు. వీరికి అదనంగా సీఆర్పీఎఫ్ బలగాలు రానున్నాయి. ఇప్పటికే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదును భారీ స్థాయిలో పట్టుకుంటున్నారు.
————————