* బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక
* జెన్కో ఎండీగా డాక్టర్ హరీష్
* సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రియాంక
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ గా సి.హెచ్. ప్రియాంక నేడు భాద్యతలు స్వీకరించారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ గాఉన్న సి.హెచ్. ప్రియాంక ను సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు ఆ శాఖ స్పెషల్ కమిషనర్ గా ఉన్న డా. హరీష్ ను తెలంగాణ జెన్ కో ఎం.డి గా బదిలీచేశారు. నేడు ఉదయం సచివాలయంలో డా, హరీష్ నుండి ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ తోపాటు తెలంగాణా ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎం.డి. గా ప్రియాంక భాద్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు సమాచార శాఖ, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు. స్పెషల్ కమిషనర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం సమాచార శాఖ కార్యక్రమాలు, పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఆ తరువాత ఆమె సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
