Chakali Ailamma Jayanti
Chakali Ailamma Jayanti: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను పాలకుర్తి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ప్రజా వైద్యులు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ కూరపాటి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ కూరపాటి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కుల కోసం చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయం కోసం పోరాటం
బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరమ్ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కొంగ వీరస్వామి మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆమె ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
అనంతరం కొడకండ్ల రాజక కాలనీ, గూడూరు సర్కిళ్లలోనూ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులు, నాయకులు, యువత పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
