* జీవన్‌రెడ్డికి పార్టీలో సముచిత గౌరవం
* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
* టీ.కాంగ్రెస్ లో జీవన్ కల్లోలం సద్దుమణిగినట్టేనా?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (Sanjay Kumar) చేరికతో కాంగ్రెస్ లో మొదలైన కల్లోలానికి తెరపడినట్లు కనిపిస్తోంది. అధిష్ఠానం పిలుపు మేరకు నిన్న ఢిల్లీ వెళ్లిన జీవన్ రెడ్డి.. (Jeevan Reddy) ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (K.C. Venugopal) తో భేటీ అయ్యారు. కనీస సమాచారం లేకుండా ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలో చేర్చుకున్న అంశంపై చర్చించారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (Revanth Reddy) భేటీ అయ్యారు. తెలంగాణ భవన్ లోని శబరి బ్లాక్ లో జరిగిన ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. జీవన్‌రెడ్డితో చర్చలు జరిపారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ లో సముచిత గౌరవం కల్పిస్తామన్నారు. ఈమేరకు అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ కోసం జీవన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక విషయంలో కొంత గందరగోళం ఏర్పడిందని రేవంత్ అన్నారు. పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియ అన్న రేవంత్ జీవన్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. ఇదేసమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఏ శాఖా ఖాళీగా లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని శాఖలకు సమర్ధమైన మంత్రులు ఉన్నారన్నారు. త్వరలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడిని అధిష్ఠానం నియమిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
———————