గుంతలో పడ్డ చిరుత అటవీశాఖ అధికారుల రెస్క్యూ ఆపరేషన్
* పైకి తెచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్
ఆకేరు న్యూస్, విజయవాడ : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దేవనగరం గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సీసీ కెమెరాల్లో చిరుత దృశ్యాలు కనిపించాయి. దీంతో ప్రజలు భయాందోళకు గురవుతున్నారు. అయితే చిరుతపులి నిన్నరాత్రి అకస్మాత్తుగా గ్రామ సమీపంలోని ఓ గుంతలో పడిపోయింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి బయటకు రాకుండా అధికారులు వలలు వేశారు. చీకటి పడడంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు అటవీశాఖ సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. చిరుతపులిని రక్షించి అడవిలో విడిచి పెట్టేందుకు రెస్క్యూ ఆపరేషన్ ఈరోజు కూడా కొనసాగుతోంది. చిరుతను పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అధికారులు చెప్పారు. ఇందుకోసం మేకను ఎరగా వేస్తున్నారు. దాన్ని చూస్తున్న పులి పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రాలేకపోతోంది.
——————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
