* కొట్టి.. కొట్టి.. చంపడం..
* ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ఘటనలపై ఆగ్రహం
* నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశం
* పోలీసుల నిర్లక్ష్యం ఉంటే వారిపై చర్యలకు సిద్ధం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే.. ఓ వ్యక్తిని దాయాదులు కొట్టి చంపడం, పెద్దపల్లి జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. భౌతికదాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే వారిని వదిలేది లేదని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శిక్షిస్తామని వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తాను (DGP Ravi Gupta) సీఎం ఆదేశించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య (Girl raped and killed) ఘటనపైనా సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. పోక్సో చట్టం (POCSO Act) ప్రకారం కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
———