* తగులబడుతున్న శ్రీగంధం వనం
* వన్యప్రాణులు బయటకొచ్చే ప్రమాదముందని భయం
ఆకేరున్యూస్, తిరుమల : తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం భయాందోళలను రేకెత్తిస్తోంది. పార్వేట మండపం ప్రాంతంలో మంటలు ఎగసిపడుతున్నాయి. శ్రీగంధం వనం ప్రాంతం ఆహుతవుతోంది. తిరుమలలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ మంటలకు వన్యప్రాణులు బయటకు వచ్చే ప్రమాదముందని అధికారులు అప్రమత్తమయ్యారు. తగిన చర్యలు చేపడుతున్నారు. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. త్వరలోనే అదుపులోకి తెస్తామని చెబుతున్నారు. భారీ ఎండలతో అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
——————————