CMRF Cheques Huzurabad
* అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం
* హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
ఆకేరు న్యూస్,హుజూరాబాద్ :
ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను నేరుగా అందిస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో ప్రతి గడపకు సంక్షేమం – ప్రజల వద్దకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 14, 12, 25, 13, 01, 02, 03, 04, 18, 05, 06, 20, 28, 22, 23, 08, 09, 10 వార్డులలో ప్రణవ్ పర్యటించారు. అనారోగ్యంతో ఆసుపత్రులపాలై ఇబ్బందులు పడుతున్న 31 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 13 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. పలువురు లబ్ధిదారులు తమ ఆర్థిక ఇబ్బందులను తలచుకుని భావోద్వేగానికి గురికాగా, ప్రణవ్ వారిని ఓదార్చి ప్రభుత్వం తరఫున పూర్తి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. స్థానికులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, వైస్ చైర్మన్ అంజలి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, జిల్లా అధికార ప్రతినిధులు, పట్టణ అధ్యక్షుడు, వార్డు అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, బ్లాక్ కాంగ్రెస్, యువజన, సేవాదళ్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
