Hasanparthy Constable Road Accident
ఆకేరు న్యూస్, జనగామ: రోడ్డు ప్రమాదంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ దుర్మరణం చెందిన విషాద సంఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.
* పోలీసుల కథనం ప్రకారం..
కొమ్మల్ల–జనగామ మార్గంలోని టోల్గేట్ సమీపంలో కానిస్టేబుల్ ధనుంజయ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఆయన బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధనుంజయ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతుడు ధనుంజయ గతంలో పాలకుర్తి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన హసన్‌పర్తి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంతో తోటి సిబ్బంది, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
