Collector N. Ravi Kamalapur Double Bedroom Houses
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెం గ్రామాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎన్. రవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయా గ్రామాల్లోని ఇళ్ల సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, ప్రస్తుతం ఉన్న వసతులు, ఇళ్ల పరిస్థితిని సమీక్షించారు. గూడూరులో 50, మర్రిపల్లిగూడెంలో 50, కమలాపూర్ లో 302 చొప్పున మొత్తం ఇళ్లకు అవసరమైన సదుపాయాలను వేగవంతంగా కల్పించాలని గృహ నిర్మాణ, ఆర్ అండ్ బీ, ఎంపీడీవో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ర్యాండమైజేషన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్, ఆర్ అండ్ బీ ఈఈ దేవిక, తహసిల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో గుండె బాబు, ఆయా గ్రామాల సర్పంచులు బండి వనజ, పబ్బు సతీష్, కదురు కవిత, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
