ఆకేరు న్యూస్, హనుమకొండ : కాళోజీ కళాక్షేత్రం (Kaloji Kala Kshethram) నిర్మాణ పనులను ఆగస్టు 15 వరకు పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలో నిర్మాణంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రం పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఆయా పనులను గురించిన వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, ఆగస్టు 15 నాటికి అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నిబంధనల మేరకు నిర్మాణ పనులు ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కాళోజీ కళాక్షేత్రంలోని ఏయే నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయో వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కుడా పిఓ అజిత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
———————————————-