– కలెక్టర్ స్నేహశబరీష్ ఆకస్మిక పర్యటన
– వనమహోత్సవంలో భాగంగా మొక్కను నాటిన కలెక్టర్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహశబరీష్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. 5, 9, 10వ తరగతుల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి, విద్యార్థుల ప్రతిస్పందనలతో సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధనా అంశాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.కళలు, సంగీతం రంగంలో విద్యార్థులు ఆసక్తిని పరిశీలించారు. డైనింగ్ హాల్, వాటర్ ప్లాంట్, పాఠశాల ప్రాంగణం యొక్క సంక్షేమ చర్యలను, పరిశుభ్రతను సమీక్షించారు.అనంతరం పాఠశాల ప్రాంగణంలో వనమహోత్సవంలో భాగంగా మొక్కను నాటారు. పాఠశాల పనితీరు పట్ల సిబ్బందిని కలెక్టర్ ప్రశంసించారు.
ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
కమలాపూర్ లోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ మంగళవారం సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.అక్కడి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తున్న ఎక్సరే సదుపాయాన్ని సమీక్షించారు. ఏఎన్ఎంలు గర్భిణీలకు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ అన్నారు. సిబ్బంది మెరుగైన పనితీరుతో వైద్య సేవలు అందించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుండె బాబు, ఎమ్మార్వో సురేష్, బీసీ గురుకులాల ఆర్ సి ఓ మోతె రాజ్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ తాడూరి రవీందర్, డీఎంహెచ్వో అప్పయ్య, డాక్టర్ నరేష్, వైద్యాధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
