* చిన్నారిని ఎత్తుకొని జోలపాట పాడిన
కలెక్టర్ పమేలా సత్పతి
* ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిత్వం
* విధి నిర్వహణలో యాక్టివ్ గా ఉండే తత్వం
ఆకేరు న్యూస్ కరీంనగర్ : కొంత మంది ఐఏఎస్ అధికారులు తమకున్న అధికారాలకు న్యాయం
చేస్తూ ప్రజలతో మమేకం అయి ప్రజల అభిమానాన్ని చూగొంటారు. కలెక్టర్ ను అనే డాపు దర్పం చూపించకుండా సాదాసీదాగా ఉంటూ ప్రజల్లో కలిసిపోయి వారికి సేవ చేస్తారు. అలాంటి కోవకు చెందిన వారే కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెలా సత్పతి.. వృత్తి రీత్యా తీరిక లేకుండా ఉన్నా ఆమె మహిళా సాధికారికత, స్కూల్ చిన్నారుల వికాసం కోసం కృషి చేస్తున్నారు. తాజాగా కలెక్టర్ చిన్నారిని ఎత్తుకొని జోలపాట పాడిఅందరి దృష్టిని ఆకర్శించారు. ఆమె పాడిన జోల పాట ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకర్శిస్తోంది గతంలోనూ ఆమె ఏబీసీడీలతో ఓ పాట పాడారు. అంగన్ వాడీలను ఇంకా సమర్థవంతంగా పనిచేయించాలనేది ఆమె సంకల్పం అందులో భాగంగా ఆమె పిల్లలకు రొటీన్ గా నేర్పించే ఏ ఫర్ ఆపిల్ బీ ఫర్ బాల్ అని కాకుండా ఏ ఫర్ యాక్టివ్ బీ ఫర్ బ్రైట్ అంటూ పిల్లలకు ప్రేరణ కలిగించే సరికొత్త పదాలతో పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉండగా ఆమె భద్రాద్రి జిల్లా సబ్ కలెక్టర్ గా వరంగల్ కమిషనర్ గాచయాదాద్రి జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. తనదైన శైలిలో అంకితభావంతో ఆమె పనిచేస్తున్న తీరు జిల్లా ప్రజలను ఆకర్శిస్తోంది.
…………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
