* డీఎన్ ఏ పరీక్షలో ధ్రువీకరణ
* కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సీఎంఓ చర్యలు
ఆకేరు న్యూస్, డెస్క్ : గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ (Vijay Rupani) భౌతిక కాయాన్ని అధికారులు గుర్తించారు. డీఎన్ ఏ పరీక్షలో ఆయన ఆనవాళ్లను కనుగొన్నారు. గుజరాత్ సీఎంఓ అధికారులు సివిల్ ఆస్పత్రికి చేరుకున్నారు. విజయ్ రూపానీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంపై చర్చించారు. విజయ్ రూపానీ స్వస్థలం రాజ్ కో్ట్(Rajkot)లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా డీఎన్ ఏ పరీక్షలు, డెడ్ బాడీల అప్పగింత ప్రక్రియలో 600 మంది డాక్టర్లు, అసిస్టెంట్లు, డ్రైవర్లు పాల్గొన్నారు. పేలుడుతో వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో చనిపోయిన వారు మాంసపు ముద్దలుగా మారిపోయారు. డీఎన్ ఏ పరీక్షలో దంతాలు, ఎముకలు కీలకంగా మారాయి. డెడ్ బాడీలకు డీఎన్ ఏ (DNA)గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 32 మంది డీఎన్ ఏలను మృతదేహాలతో అధికారులు సరిపోల్చారు. 14 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సివిల్ ఆస్పత్రి అధికారులు అప్పగించారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
