Congress 1000 Days Kamlapur
* బీఆర్ఎస్పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ శ్రేణులు
ఆకేరు న్యూస్, కమలాపూర్: హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రగతి పాలన నివేదిక వేడుకలను గురువారం కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలో కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండు కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో హామీలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకటించిన మేనిఫెస్టోలు ఏ మేరకు అమలయ్యాయనే అంశాలపై బహిరంగ చర్చకు రావాలని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు.
ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్, నాయకులు బాలసాని రమేష్ గౌడ్, మాట్ల రమేష్, మౌటం కుమారస్వామి, పోడేటి బిక్షపతి, తడక శ్రీకాంత్, విష్ణుదాసు వంశీధర్ రావు, జయచందర్ పటేల్, జనగాని శివకృష్ణ, నాంపల్లి ప్రభాకర్, ఉపాసి కృష్ణ, ఆకినపల్లి బిక్షపతి, కెత్తె రవి, జేరిపోతుల బిక్షపతి, ఆడెపు విజయ, గూడెపు మొగిలయ్య, రెక్కల నారాయణరెడ్డి, కొండ తిరుపతి, దూడ శ్రీకాంత్, పుల్ల శోభన్, ముండెద్దుల నాగరాజు, పెరుమాండ్ల పరుశురాములు, కొండ రమేష్, గాలిబు నవీన్, గంధసిరి అనిల్, గంధసిరి బిక్షపతి, మాట్ల కళ్యాణ్, జన్ను బిక్షపతి తదితరులతో పాటు సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
