
నల్లగొండ డీసీసీబీ నూతన చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి నియామకం.
* చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం
* కొత్త చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి!
ఆకేరు న్యూస్, నల్గొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీని (DCCB) కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి (Gongidi Mahender Reddy)పై డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గొంగిడి మహేందర్ రెడ్డిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ 14 మంది డైరెక్టర్లు కొద్దిరోజుల క్రితం డీసీఓ కిరణ్ కుమార్ కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. డైరెక్టర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మేరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు నల్లగొండ డీసీసీబీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించగా 15మంది డైరెక్టర్లు మహేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో మహేందర్ రెడ్డి పదవి కోల్పోయినట్లు అయింది. నూతన చైర్మన్ ఎంపిక కోసం త్వరలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు డీసీఓ తెలిపారు. నూతన డీసీసీబీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) నియామకం కానున్నారు.
కేరళ క్యాంప్ నుంచి నేరుగా సమావేశానికి
చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పట్టుదలతో ఉన్నకాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా ఉన్న 14 మం ది డైరెక్టర్లను కేరళలోని ప్రత్యేక శిబిరానికి తరలించారు. క్యాంపులో ఉన్న శుక్రవారం నేరుగా సమావేశానికి వచ్చారు. సహకార చట్టం నిబంధనల అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే పాలకవర్గ సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయాలి. ఈప్రకారం మొత్తం 19 మంది డైరెక్టర్లకు 14మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయా ల్సి ఉంటుంది. ఈరోజు జరిగిన సమావేశంలో 15 మంది మహేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేశారు. త్వరలోనే కొత్త చైర్మన్ ను ఎన్నుకోనున్నారు.
——————–