* ఏర్పాట్లు చేస్తున్న జనసేన తెలంగాణ నేతలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని శనివారం సందర్శించనున్నారు. స్వామి ఆలయంలో మొక్కలు తీర్చుకోనున్నారు. ఉదయం 7 గంటలకు మాదాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన కొండగట్టు (Kondagattu) బయల్దేరుతారు. 11 గంటల కు కొండగట్టుకు చేరుకుని గంటన్నర పాటు ఆలయంలో పూజల్లో పాల్గొంటారు. దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్కు వస్తారు. ఈమేరకు జనసేన తెలంగాణ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన నాయకుడు సాగర్ మాట్లాడుతూ.. కొండగట్టు అంజన్న ఆలయంలో పవన్ కల్యాణ్ మొక్కులు చెల్లిస్తారని తెలిపారు. పవన్ దీక్షలో ఉన్నారు కాబట్టి అభిమానులు, జనసేన (Jana Sena) కార్యకర్తలు సంయమనం పాటించాలని అన్నారు. త్వరలోనే తెలంగాణ నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం పెడతారని చెప్పారు. తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనసేన పాత కమిటీలు రద్దు చేసి త్వరలోనే పవన్ కల్యాణ్ కొత్త కమిటీలు నియమిస్తారని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతం పై నెలరోజుల్లో పవన్ సమావేశం నిర్వహిస్తారని అన్నారు.
——————–