Congress Village Unit Elections
* మీదికొండ, రాఘవాపూర్…
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండ, రాఘవాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. జిల్లా నాయకులు సిద్ధారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, నాగరబోయిన శ్రీరాములు పర్యవేక్షణలో జరిగాయి.
* “మీదికొండలో..
అధ్యక్షుడిగా గుర్రపు ప్రశాంత్, ఉపాధ్యక్షుడిగా లద్దులూరి సమ్మయ్య, కార్యదర్శిగా జోగు రవి, కోశాధికారి ఆలకుంట ఎల్లయ్య, కొమ్మరాజుల మహేష్ లు ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ జోగు సంపత్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది.
* “రాఘవపూర్ లో..
రాఘవపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా గంగుల మహేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పర్యవేక్షకులు సిద్ధారెడ్డి, శిరీష్ రెడ్డి, శ్రీరాములు పర్యవేక్షణలో జరిగిన ఎన్నికలో గంగుల మహేశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో కుక్కల రాజు, పవన్, రవి, శివ, ఉదయ్, క్రాంతి, సుమన్, దశరథం గ్రామస్తులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
