Station Ghanpur Canal Water
* ఆనందం వ్యక్తం చేసిన రైతులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
పదేళ్ల తర్వాత కాల్వ ద్వారా సాగునీరు రావడంతో జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం
ఇప్పగూడెం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి శనివారం స్టేషన్ ఘన్ పూర్ నుండి సాగునీటినీ విడుదల చేసిన విషయం వితమే. దీనితో 4 L కాలువ ద్వారా పంట పొలాల్లోకి సాగునీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కాలువ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కాలువలో నీరు పారింది లేదని, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి దృష్టికి తీసుకుపోగా స్పందించిన కడియం రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేయడంతో ఈ సందర్భంగా కడియం శ్రీహరికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు శిరీష్ రెడ్డితో పాటు గ్రామ పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజాలు, మందపురం అనిల్, మందపురం ఎల్లగౌడ్, గట్టు మల్లయ్య, నెంబర్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
