* భారీ మొత్తంలో సీజ్ చేసిన అధికారులు
ఆకేరు న్యూస్, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా(SIDDIPET DISTRICT) ములుగు మండలం కరకపట్ల గ్రామంలో అధికారులు భారీ ఎత్తున నకిలీ యాంటీబయోటిక్స్(FAKE ANTIBIOTICS) ను గుర్తించి సీజ్ చేశారు. డ్రగ్ కంట్రోల్ బ్యూరో(DRUGS CONTROL BUREAU) ఆధ్వర్యంలో జోడాస్ ఎక్స్పో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో దాడులు చేపట్టారు. అక్కడ భారీ మొత్తంలో నకిలీ యాంటీబయోటిక్స్ ను గుర్తించారు. వాటి విలువ సుమారు కోటిన్నర ఉంటుందని డ్రగ్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. ప్రముఖ కంపెనీతో నకిలీ యాంటీ బయాటిక్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రష్యా(RUSSIA)కు సైతం వీటిని విక్రయిస్తున్నట్లు తెలిపారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
