* రాంగోపాల్ వర్మ వీడియో వైరల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి గతంలో ఎక్స్‌లో పోస్ట్ చేసిన వ్యవహారంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైంది. రెండు సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేస్తారనే వార్తలు వచ్చాయి. పోలీసులు ఆయన కోసం హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి కూడా వచ్చారు. షూటింగ్లో ఉన్నట్లు తెలుసుకుని కోయంబత్తూరు కూడా వెళ్లినట్లు తెలిసింది. వర్మ కోసం పోలీసులు గాలిస్తుండగా, వర్మ హాట్ కామెంట్స్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో వర్మ(VARMA) ఏమన్నారంటే.. “నేను వణికిపోతున్నా.. మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాఅంటూ పుకార్లు సృష్టిస్తున్న కొందరు మీడియా వాళ్లకు ఈ వీడియో నిరాశ కలిగించవచ్చు. క్షమించండి. నేను ఏడాది కింద ఏదో ట్వీట్ పెట్టానని నాపై ఆరోపణలున్నాయి.
ఆ ట్వీట్స్‌తో ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. విచిత్రమేంటంటే.. ఏడాది కింద పెట్టిన ట్వీట్స్ నాలుగు భిన్నమైన ప్రాంతాల్లో నలుగురు వ్యక్తులకు మూడునాలుగు రోజుల వ్యవధిలో ఒకేసారి వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో పిర్యాదు చేసి కేసులు పెట్టడం జరిగింది. ఎవరిమీద పెట్టానో వాళ్లకు సంబంధం లేకుండా ఎవరో థర్డ్ పార్టీ కేసు(Third Party Case) పెడితే.. ఈ కేసు సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది నా అనుమానం. విచారణ చేయడానికి పద్దతి ప్రకారం ఉన్న చట్టాలను వాడుతున్నారా..? పొలిటికల్ పార్టీ(Political Party)లు వ్యవస్థలోని పోలీసులను ఆయుధాలుగా వాడుతున్నారా..? నాకొక నోటీస్ వచ్చింది.. నేను ఫలానా తారీఖు వస్తానని రిప్లై ఇచ్చా. షూటింగ్ వర్క్ కొనసాగుతుండటంతో నిర్మాతకు నష్టం రావొద్దని నేను మళ్లీ టైం అడిగా. ఈ కేసు ఏమైనా ఎమర్జెన్సీ కేసా ఏమైనా.. ఏడాది తర్వాత ట్వీట్ చూసిన అతనికి వారంలో అన్నీ అయిపోవాలనడంలో ఏమైనా అర్థం ఉంటదా అసలు.. హత్యకేసుల్లాంటి వాటికి సంవత్సరాలు తీసుకొని.. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసుల కంటే ముందే వీటిని విచారించడమేంటి” అని తనదైన శైలిలో కౌంటర్ వేశారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
