cp sunpreet singh national Lok adalath
*లోక్ అదాలత్ ద్వారా 10,922 కేసులు పరిష్కారం
– వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
అకేరు న్యూస్ డెస్క్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించిందని వరంగల్ పోలీస్ కమిషనర్ అన్నారు. వీటి ద్వారా 10922 కేసులు పరిష్కారమయ్యాయని, సైబర్ క్రైమ్ కేసుల్లో 1 కోటి 17 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేయాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన మొత్తం కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు -1880, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు-2864, ఈ పెట్టి కేసులు -201, డ్రంకెన్ అండ్ డ్రైవ్, మోటార్ వెహికల్ చట్టం కేసులు-5977, సైబర్ కేసులు -197 పరిష్కరించడం ద్వారా బాధితులకు సంబంధించి వివిధ బ్యాంక్ ఖాతాల్లో నిలుపుదల చేసిన 1,17,95,706/- రూపాయలు బాధితులకు అందజేయాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు వెలుబడించిందని తెలిపారు.
రాజీ మార్గం రాజా మార్గమని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించి కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
అదేవిధంగా లోక్ అదాలత్ సద్వినియోగానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయ సేవాధికారులకు ఈ సందర్భంగా సీపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
