* ఛాతీ నొప్పి రావడంతో అర్థరాత్రి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
* తమిళ, తెలుగు , మళయాల, కన్నడ సినిమాల్లో నటన
ఆకేరు న్యూస్ , సినిమా : ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ ( 48 ) ఆకస్మికంగా మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలాజీ మృతి చెందారు. చెన్నయిలో శనివారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కోలివుడ్ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అభిమానులు, సినీపరిశ్రమ పెద్దలు కడసారి చూపు కోసం ఆయన ఇంటి కి చేరుకుంటున్నారు. టీవీ సీరియల్స్‌తో నటన మొదలు పెట్టిన బాలాజీ తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ సినిమాల్లో నటించాడు. ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. చిట్టీ పేరుతో బాగా పాపులర్ అయిన టీవీ సీరియల్ లో బాలాజీ పాత్రకు బాగా పేరు వచ్చింది. అదే సీరియల్‌ను తెలుగులో పిన్నీ పేరుతో డబ్ చేశారు. తెలుగులో చిరుత, సాంబ, ఘర్షణ, టక్ జగదీశ్ లాంటి చాలా సినిమాల్లో నటించాడు. సైకో పాత్రలో కమల్ హాసన్ రాఘవన్ సినిమాలో నటనకు ఆయనకు బాగా పేరు వచ్చింది.
——————————————