– 11వ తేదీ బుధవారారానికి మార్పు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకు, ప్రతీ మంగళవారం, శుక్రవారం మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్, బేగంపేట, హైదరాబాద్ నందు రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 16వ కేంద్ర ఆర్థిక సంఘంతో మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో నిర్వహించబడే ముఖ్యమైన సమావేశాల కారణంగా, తేదీ 10.09.2024 మంగళవారం రోజున నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమం, తేదీ 11.09.2024 బుధవారానికి అధికారులు వాయిదా వేశారు. ఈ సందర్భంగా, అర్జీదారులందరు ఈ మార్పును గమనించి, తేదీ 10.09.2024 మంగళవారానికి బదులుగా తేదీ11.09.2024 బుధవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
