Minister Ponguleti on Indiramma Houses Update
* రూ. 230కే సిమెంట్ బస్తా..
* గుడిసెలన్నీ పక్కా ఇళ్లుగా మార్పు
* శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుపేదల ఆత్మగౌరవమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనసభలో స్పష్టం చేశారు. శాసనసభలో ఇందిరమ్మ ఇళ్లపై జరిగిన చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణను ‘గుడిసెలు లేని రాష్ట్రం’గా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 59,000 గుడిసెల స్థానంలో రెండో విడతలో ప్రాధాన్యత క్రమంలో పక్కా ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు.
* రూ. 45 వేల కోట్ల భారీ బడ్జెట్..
దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని పొంగులేటి అన్నారు. ఇప్పటివరకు అనుమతించిన 8 లక్షల ఇళ్లకు గాను మొత్తం రూ. 45,000 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం భరిస్తోందని వివరించారు. లబ్ధిదారుల డ్రాలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, అర్హత లేని వారిని నిబంధనల ప్రకారం తొలగిస్తున్నామని తెలిపారు.
* చౌకగా ఇటుకలు, సిమెంట్, స్టీల్..
ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో రూ. 310 పైగా ఉన్న 50 కేజీల సిమెంట్ బస్తాను లబ్ధిదారులకు కేవలం రూ. 230 కే అందించేందుకు సిమెంట్ కంపెనీలతో ఒప్పందం పూర్తయిందన్నారు. త్వరలోనే స్టీల్ ధరల విషయంలోనూ ఇలాంటి ఊరట కలిగిస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాల సభ్యులుగా ఉన్న పేదలకు నిర్మాణ ప్రారంభంలో ఇబ్బంది లేకుండా రూ. 1 లక్ష అడ్వాన్స్ ఇప్పించే సదుపాయం కల్పించామని, ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
