Chakali Ilamma Mulugu
ఆకేరు న్యూస్, ములుగు : జిల్లా కేంద్రంలో సంక్షేమ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు, ఇందులో బాగంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి. రామ్మోహన్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత అని అన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ళ శంకర్, పరికిరాల రవి,ఎన్నిలా మహేందర్ వడ్డేపల్లి సారంగపాణి జలిగం శ్రీనివాసు చాకలి సంఘ నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు, సంక్షేమ భవన కార్యాలయ సిబ్బంది, బీసీ వెల్ఫేర్ శాఖ ఉద్యోగులు మొగిళి, సరిత, మానస, రేణుక, సాడాలు, ప్రతపు రత్నాకర్, కుమారస్వామి, జి. గోపాల్ చారి, నాలుగవ తరగతి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
