A grayscale shot of a child stopping with his hand
* నాలుగు రోజుల తర్వాత వెలుగు చూసిన ఘటన
ఆకేరు న్యూస్ , న్యూ ఢిల్లీ : ఢిల్లీలో దారుణం జరిగింది. ఐదేళ్ళ బాలికపై అత్యాచారం చేసి , కిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. ఢిల్లీ శివారు ప్రాంత బవానాలో జరిగిన ఈ ఘటనకు సంబందించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక వ్యక్తి బాలికను గత సోమవారం అపహరించి జన సంచారం లేని ఒక ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. అనంతరం బ్లేడ్‌తో గొంతుకోశాడు. అప్పటికి కూడా ఆ మానవ మృగం ఆగకుండా ఇటుకతో తలమీద మోది హత్య చేశాడని ఔటర్ నార్త్ డిప్యూటీ కమిషనర్ ఆప్ పోలీస్ రవి కుమార్ సింగ్ మీడియాకు వెల్లడించారు.
* నిందితుడు కుటుంబానికి పరిచయస్తుడే..
బాలికను అమానుషంగా రేప్ చేసి హత్య చేసిన నిందితుడు ఆకుటుంబానికి పరిచయస్తుడే. అతడు ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. స్థానికంగా టీ స్టాల్ నడుపుకుంటున్న బాలిక తల్లిదండ్రుల దగ్గరకు 28 ఏళ్ళ యువకుడు తరచుగా వచ్చేవాడు. దాంతో ఆకుటుంబానికి కొంత మేర పరిచయం ఏర్పడింది. ఈ అవకాశం తీసుకుని బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం వేట కొనసాగించారు. ప్రత్యేక టీంలు అతన్ని పట్టకునేందుకు ప్రయత్నించాయి. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో బాలిక అతని వద్దకు నడుచుకుంటూ వెళ్ళే దృశ్యాలు కనిపించాయి. దీంతో పోలీసులు వేట తీవ్రం చేశారు. పశ్చిమ బెంగాల్ పారిపోయేందుకు అతను ఎక్కిన రైలును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హత్యానేరం, పోక్సో యాక్ట్‌తో పాటు పలు రకాల ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
——————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
