Dhanush Om Chapter 1
* ‘జైలర్ 2’ విడుదల నేపథ్యంలో నిర్ణయం?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఓం చాప్టర్ 1’ అక్టోబర్ 16న విడుదల కావలసి ఉండగా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ముందుగా అనుకున్న తేదీకి సినిమా ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో కొత్త విడుదల తేదీపై ఆసక్తి నెలకొంది.
* ‘జైలర్ 2’ నేపథ్యంలోనేనా?
ఇదిలా ఉండగా.. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ అక్టోబర్ 15న విడుదల నేపథ్యంలోనే ‘ఓం చాప్టర్ 1’ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు భారీ చిత్రాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వస్తే థియేటర్ల కేటాయింపు, ఓపెనింగ్స్ వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ‘ఓం చాప్టర్ 1’ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
* కొత్త తేదీపై ఆసక్తి
ధనుష్ నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వాయిదా తర్వాత కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించాల్సి ఉంది. ‘జైలర్ 2’ విడుదలకు అనుగుణంగానే ఈ మార్పు జరిగిందన్న ప్రచారంపై కూడా మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
