DTO Venkanna Tribute Bhupalpally
* నల్ల బ్యాడ్జీలతో నివాళులర్పించిన హనుమకొండ ఆర్టీఓ ఉద్యోగులు
అకేరు న్యూస్, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) వెంకన్న అకాల మరణం పట్ల హనుమకొండ ఆర్టీఓ కార్యాలయ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి తమ సంతాపాన్ని తెలియజేశారు.
కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డీటీఓ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, డీటీఓగా ఆయన సేవలు ఎంతో ప్రశంసనీయమని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన అధికారిని కోల్పోవడం రవాణా శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
