Farmers Dharna Station Ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేసి తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా రైతు సంఘం నాయకులు మహంకాళి నాగరాజు, బూర్ల యాదగిరి మాట్లాడుతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. ఎరువులు, పెస్టిసైడ్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వ్యవసాయం చేయలేక పెట్టుబడి సహాయం అందక రైతులు ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని అన్నారు. రైతులకు 1 ఎకరానికి 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.
అదేవిధంగా సన్నరకం వడ్లకు వెయ్యి రూపాయల బోనస్ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో రైతు సంఘం నాయకులు బానోతు తిరుపతి, బుస్సా రోహిత్, పొన్న సాయిలు, భూక్యా లచ్చిరాం, భూక్యా రాములు, సిపిఐ నాయకులు తోట రమేష్, రహ్మతుల్లా, పస్తం పృథ్విరాజ్, నీరటి సంతోష్, చింత నిఖిల్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు
