Janasena Leaders Reaction to kalvakuntla Kavitha
అకేరు న్యూస్ హన్మకొండ: జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లేదని జనసేనపార్టీ నాయకులు మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ హన్మకొండ పర్యటనలో శనివారం జనసేనాని పట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.లిక్కర్ స్కామ్ చేసి తీహార్ జైలులో చిప్పకూడు తిన్న కవిత కూడా నీతులు చెప్పడం హాస్యపదంగా ఉందన్నారు.కన్న తండ్రికే వెన్నుపోటు పొడిచి అధికారం కాంక్షతో కవిత మతితప్పి మాట్లాడుతుందన్నారు.సామజిక న్యాయం గురించి కెసిఆర్ పక్కన పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని వ్యాఖ్యనించారు.రాజకీయ ఉనికి కోసం తెలంగాణ కార్డు పట్టుకొని తిరుగుతున్నందని పేర్కొన్నారు.కవిత ఎన్ని వేషాలు వేసిన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.తెలంగాణ యువత జనసేన వైపు చూస్తున్నారని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే మీడియాలో ఉంటానని దిగజారి మాట్లాడుతుందన్నారు.బ్యూటీ పార్లర్ నడిపే కవిత పార్టీ నడిపే డబ్బు ఎక్కడదో చెప్పాలన్నారు.అక్రమంగా తెలంగాణను కవిత కుటుంబం దోచుకొని ఆస్తులు కూడబెట్టారని వ్యాఖ్యనించారు.దమ్ముంటే కవిత ఆస్తుల గురించి తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వరంగల్ తూర్పు పిఓసి సభ్యులు గడ్డం రాకేష్,జిల్లా నాయకులు కొల్లూరి అనుదీప్,అమంచ సునీల్,పద్మజ రెడ్డి,గొపు నవీన్,ప్రసన్న కుమార్,దయాకర్,ప్రశాంత్ రెడ్డి,కొలిపాక వంశీ కృష్ణ,ఫరీద్,షేక్ ఆన్సర్ తదితరులు ఉన్నారు
