Elon Musk Net Worth world record
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, స్పేస్ రీసెర్చ్, సోషల్ మీడియా రంగాలను ఒంటిచేత్తో శాసిస్తున్న అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మరో అరుదైన మైలురాయికి చేరువయ్యారు. ప్రపంచ ఆర్థిక చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకాని విధంగా సరికొత్త రికార్డును సృష్టించేందుకు ఆయన అడుగులు వేస్తున్నారు.
ఒకవైపు ఆయన సంపద రాకెట్ వేగంతో దూసుకుపోతుండగా, మరోవైపు భారతదేశంలో మారుతున్న సామాజిక, జనాభా పరిస్థితులపై మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.
* జూన్ 12న ‘స్పేస్ ఎక్స్’ ఐపీఓ.. కోటి కోట్ల వైపు మస్క్..
బిలియనీర్ల జాబితాలో ఎప్పుడూ అగ్రస్థానంలో నిలిచే ఎలాన్ మస్క్, త్వరలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ట్రిలియనీర్’ (Trillionaire) గా అవతరించబోతున్నారు. మన భారతీయ కరెన్సీ ప్రకారం చెప్పాలంటే ఆయన ఆస్తి విలువ ఏకంగా కోటి కోట్ల రూపాయల మార్కును దాటనుంది. ఇందుకు జూన్ 12వ తేదీ (శుక్రవారం) ఒక కీలక వేదిక కానుంది. మస్క్‌కు చెందిన ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘స్పేస్ ఎక్స్’ (SpaceX) ఇన్సిడెంట్ పబ్లిక్ ఆఫరింగ్‌కు రాబోతోంది.
ALSO READ :
ప్రస్తుతం మార్కెట్ అంచనాల ప్రకారం.. ఈ ప్రక్రియ విజయవంతమైతే మస్క్ ఆస్తుల నికర విలువ సరికొత్త ఎత్తుకు చేరుకుంటుంది. ఒకవేళ ఆయన తన సంపదను ప్రతిరోజూ, ప్రతి గంటకూ రూ. 9.5 కోట్ల చొప్పున నిరంతరాయంగా ఖర్చు చేస్తూ పోయినా.. ఆ మొత్తం కరిగిపోవడానికి 100 సంవత్సరాలకు పైగా సమయం పడుతుందంటే ఆయన సంపద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని మొత్తం నివాస, వాణిజ్య భవనాలన్నింటి విలువ కలిపినా కూడా మస్క్ సంపద కన్నా తక్కువగానే ఉండటం విశేషం.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

1 thought on “ELON MUSK NET WORTH | మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డు..”