
– ఉజ్జయినీ మహాకాళిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
– అమ్మవారికి బోనం సమర్పించిన మంత్రి కొండా సురేఖ
ఆకేరు న్యూస్, సికింద్రాబాద్ : లష్కర్ బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. మహిళలు తీసుకొస్తున్న బోనాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సికింద్రాబాద్ పరిసరాల్లో భక్తజన జాతర కొనసాగుతోంది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో సందడి వాతావరణం ఏర్పడింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanthreddy) కూడా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మహాకాళికి బోనం సమర్పించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆ తల్లిని కోరుకున్నట్లు సీఎం తెలిపారు. సీఎంతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. హర్యానా గవర్నర్ బంగారు దత్తాత్రేయతోపాటు పలువురు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
……………………………………….