Varanasi Movie Update
* జక్కన్న సర్ప్రైజ్ ఏంటి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ పాన్ వరల్డ్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మహేష్ అభిమానులకు, మూవీ లవర్స్‌కు పెద్ద పండగే అని చెప్పవచ్చు.
* ఆగస్టు 9న ‘మాస్’ ట్రీట్ ఉందా..
ప్రతి ఏడాది ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక క్రేజీ అప్డేట్, పోస్టర్ లేదా గ్లింప్స్ విడుదల చేయడం పరిపాటిగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాజమౌళి ప్రాజెక్ట్ ‘వారణాసి’ నుంచి విజువల్ గ్లింప్స్ వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం.. ఈ బర్త్‌డేకి ఎలాంటి గ్లింప్స్ రావడం లేదని, కేవలం ఒక పోస్టర్ మాత్రమే వచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం ఈ విషయమై చిత్రబృందం (మేకర్స్) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ నెట్టింట మాత్రం గ్లింప్స్ రావడం లేదనే వార్తలు గట్టిగా ప్రచారమవుతుండటంతో అభిమానులలో కొంత నిరాశ వ్యక్తమవుతోంది.
* భారీ తారాగణం – గ్రాండ్ రిలీజ్…
ఈ గ్లోబల్ అడ్వెంచరస్ డ్రామాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్‌గా అలరించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కె.ఎల్. నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు.
ఉగాది పండుగ, వరుస సెలవులను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మేకర్స్ నుంచి ఆగస్టు 9కి సంబంధించిన అప్డేట్పై క్లారిటీ వస్తే కానీ సస్పన్స్ వీడదు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
