Electrical Safety Training for Teachers
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
ట్రస్మా ఆధ్వర్యంలో విద్యుత్ ప్రమాదాల నివారణ, భద్రతపై ఫిజికల్ సైన్స్, ఈవీఎస్ ఉపాధ్యాయులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జనగామ జిల్లా కేంద్రంలోని సెంట్ మేరీస్ హై స్కూల్లో బుధవారం జరిగింది.
విద్యార్థుల్లో విద్యుత్ భద్రతపై అవగాహన పెంపొందించి, విద్యుత్ ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGNPDCL) జనగామ ఆధ్వర్యంలో, TRSMA – జనగామ జిల్లా సహకారంతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని టి.జి.ఎన్పీడీసీఎల్ జనగామ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్స్) చి.సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
టి.జి.ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్, DPE & సీనియర్ ఫ్యాకల్టీ పి. శ్రీకాంత్ విద్యుత్ భద్రత, విద్యుత్ ప్రమాదాల నివారణ, పాఠశాలలు, గృహాలలో పాటించాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల పనితీరు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా TRSMA జనగామ జిల్లా అధ్యక్షుడు పి.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించడంలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని ప్రతి ఉపాధ్యాయుడు తమ పాఠశాలలో విద్యార్థులకు చేరవేసి ప్రమాద రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు టి.జి.ఎన్పీడీసీఎల్ తరఫున పాల్గొన్న ధ్రువపత్రాలు (Certificates) అధికారులు అందించారు. ఈ కార్యక్రమంలో TRSMA జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు పి.సంజీవ రెడ్డి, జనగామ డివిజన్ అధ్యక్షుడు ఎన్.రామ్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ అధ్యక్షుడు యు. మల్లేశం, వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
