Parvathagiri Farmers Power Issue
Published:
* అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఆకేరు న్యూస్, పర్వతగిరి: మండలంలోని చెరువుకొమ్ము తండాలో ఎల్టీ విద్యుత్ లైన్ తెగిపడి రెండు రోజులు దాటుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు సమాచారం అందించినా స్పందించకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో గురువారం రైతులే స్వయంగా ప్రాణాలకు తెగించి విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేసుకున్నారు.
లైన్లు తెగిపడటంతో పంటలకు నీరందక ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆవేదన చెందారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, శాశ్వత పరిపరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

సీనియర్ కరస్పాండెంట్
జిల్లపెళ్లి దీపిక, MA ( Journalism )
గత ఐదు సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
