Mahabubabad EX-MLA Redya Naik Accident
Published:
Updated: 13 Aug 2026 • 11:50 AM
ఆకేరు న్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ శివారులో మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్‌కు ప్రమాదం తృటిలో తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరొక కారు బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రెడ్యానాయక్ వాహనం వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ఆయనకు ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. రెడ్యానాయక్ సురక్షితంగా ఉన్నారని తెలియడంతో ఆయన అనుచరులు, అభిమానులు ఉపశమనం పొందారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

సీనియర్ కరస్పాండెంట్
జిల్లపెళ్లి దీపిక, MA ( Journalism )
గత ఐదు సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
