White House shooting incident Trump
ఆకేరు న్యూస్, డెస్క్ :
అత్యంత భారీ భద్రత ఉండే వైట్ హౌజ్ వద్ద కాల్పుల ఘటన కలకలం రేగింది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ విందులో రాత్రి సుమారు 8:40 గంటల సమయంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. భద్రతా తనిఖీ కేంద్రం (Magnetometer area) వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది
* ఆధునిక ఆయుధాలతో దాడి
కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన కోల్ థామస్ అలెన్ (31)అనే వ్యక్తి అనేక ఆయుధాలతో సెక్యూరిటీ చెక్‌పాయింట్ వైపు దూసుకువచ్చాడు.
* కోల్ థామస్ వద్ద ఒక షాట్‌గన్, ఒక హ్యాండ్‌గన్ వివిద రకాల కత్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు కాల్పులు జరపగానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో థామస్ పై కూడా ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
*సీక్రెట్ సర్వీస్ అధికారికి గాయాలు
ఈ కాల్పుల్లో ఒక సీక్రెట్ సర్వీస్ అధికారికి సైతం గాయాలు అయినాయి. ఆ అధికారి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పిందని ఆదికారులు తెలిపారు. ఆ అధికారిని ట్రంప్ స్వయంగా కలిసి పరామర్శించారు.
*సీక్రెట్ సర్వీస్ అధికారులను అభినందించిన ట్రంప్
కాల్పుల ఘటన జరిగిన రెండు గంటల తర్వాత ట్రంప్ విలేకరులతో మాట్లాడారు
“సీక్రెట్ సర్వీస్ అధికారులు అద్భుతంగా పనిచేశారు. వారు ప్రాణాలకు తెగించి ఆ దుండగుడిని అడ్డుకున్నారు. పారదర్శకత కోసం తాను ఆ ఘటనకు సంబంధించిన టేప్‌ను విడుదల చేయాలని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. అందులో నిందితుడు రాజ్యాంగంపై దాడికి ఎలా ప్రయత్నించాడో చూడవచ్చని పేర్కొన్నారు.
విలేకరులు అడిగిన ప్రశ్నకు నేను ప్రభావవంతంగా పని చేస్తున్నాను కాబట్టే నాపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు..
——-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
