* 4 కోట్ల విలువైన ఆస్తి నష్టం..?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీలో అగ్ని ప్రమాదం సంభవించింది. సినిమా కోసం వేసిన అతిపెద్ద సెట్ మంటల్లో తగలబడింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ప్రస్తుతం కల్యాణ్‌రాం ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని నిర్మిస్తూనే కళ్యాణ్ రామ్ తాను హీరోగా ఈ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో కాంగ్రెస్ నాయకురాలు, సూపర్ స్టార్ విజయశాంతి కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో సీబీఐకి సంబందించిన సన్నివేశాలు కీలకం కాబోతున్నాయట. దీనితో ప్రత్యేకంగా సీబీఐ ఆఫీస్ సెట్ ని నిర్మించారు. పది రోజుల పాటు ఈ సెట్ లో షూటింగ్ జరగాల్సి ఉంది. దానికి సంబందించిన సన్నివేశాలు దాదాపుగా పూర్తయ్యాయట. ఇక కొంత భాగం మాత్రమే పెండింగ్ ఉంది. ఇంతలోనే ఆ సెట్ మంటల్లో కాలి బూడిదైపోయింది. సెట్ కాలిపోవడం వల్ల నిర్మాతకి సుమారు 4 కోట్ల నష్టం అని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆస్తి నష్టాన్ని నిర్వాహకులు ధ్రువీకరించాల్సి ఉంది.
———————