నవనీత్ కౌర్
* నవనీత్ కౌర్ అనుచిత వ్యాఖ్యలు
* పోలీసులకు ఎన్నికల సంఘం ఫిర్యాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ లోక్సభ ఎన్నికల ప్రచారం వివాదాస్పదంగా మారుతోంది. నిన్న బీజేపీకి ఓటేస్తే.. హైదరాబాద్ ను పాకిస్తాన్ కాకుండా చూస్తామని పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన నవనీత్ కౌర్.. తాజాగా కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్తాన్ కు వేసినట్లే అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. షాద్ నగర్ ఎన్నికల ప్రచారంలో ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు షాద్నగర్ పోలీస్స్టేషన్ లో ఆమెపై కేసు నమోదు చేశారు.
——————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
