* ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అర్వింద్ కుమార్
* జూలై 1న విచారణకు రావాలని ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫార్ములా ఈ కార్ రేస్ కేసు (FORMULA – E CAR RACE CASE) మరో మలుపు తిరగబోతోంది. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ (KTR)ను విచారించిన అధికారులు, మరోసారి ఐఏఎస్ అర్వింద్ కుమార్‌ను విచారించనున్నారు. ఈమేరకు ఏసీబీ అధికారులు ఆయన నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన సెలవుల్లో విదేశాలకు వెళ్లారు. జూన్ 30న హైదరాబాద్(HYDERABAD)కు రానున్నారు. ఈ నేపథ్యంలో జూలై 1న తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన ఏసీబీ (ACB) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన చెప్పిన సమాచారం ఆధారంగానే కేటీఆర్ పై కూడా కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో డ్రాఫ్టింగ్ దగ్గర నుండి అన్ని తానై, అరవింద్ కుమార్ (ARVIND KUMAR) వ్యవహరించారు. ఇప్పటి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రెండుసార్లు విచారించిన ఏసీబీ, కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరోసారి అరవింద్ కుమార్ ను విచారించాలని నిర్ణయించింది.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
