Why Fridges Explode Safety
ఆకేరు న్యూస్, డెస్క్:
వేసవి కాలంలో ఎండల తీవ్రతను తట్టుకోవడానికి ఇళ్లలో ఎయిర్ కండిషנర్లు, రిఫ్రిజిరేటర్ల (ఫ్రిడ్జ్) వినియోగం విపరీతంగా పెరుగుతుంది. అయితే, చల్లదనాన్ని ఇచ్చే ఈ ఫ్రిడ్జ్‌లు సరైన అవగాహన లేకపోతే ప్రమాదకరమైన బాంబులుగా మారే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ఫ్రిడ్జ్‌లు పేలుతున్న ఘటనలపై 15 ఏళ్ల అనుభవం ఉన్న హోమ్ అప్లయన్సెస్ నిపుణుడు విజయ్ భాస్కర్ వెల్లడించిన వాస్తవాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ చూద్దాం.
* గోడకు అంటించి పెడితే ముప్పే…
ఆధునిక ఇన్వెర్టర్ ఫ్రిడ్జ్‌లకు వెనుక వైపు ఉండే కండెన్సర్ కాయిల్స్ బాడీ లోపలే (ఇన్‌బిల్ట్) ఉంటాయి. దీనివల్ల ఫ్రిడ్జ్ రన్ అవుతున్నప్పుడు బాడీ ఇరువైపులా, కింది భాగంలోని కంప్రెసర్ భారీగా వేడెక్కుతాయి. కార్ రేడియేటర్ తరహాలోనే వీటికి నిరంతరం బయటి గాలి తగలడం ఎంతో ముఖ్యం. చాలామంది స్థలం కోసం ఫ్రిడ్జ్‌ను గోడకు పూర్తిగా అంటించి పెడతారు. గాలి ఆడకపోవడం వల్ల లోపల వేడి పేరుకుపోయి కంప్రెసర్ పేలిపోయే అవకాశం ఉంది. అందువల్ల గోడకు, ఫ్రిడ్జ్‌కు మధ్య కనీసం ఒక అడుగు (1 Feet) ఖాళీ స్థలం ఉంచాలి.
* కిచెన్ రూమ్‌లో ఫ్రిడ్జ్ పెడుతున్నారా…
చిన్న వంటగదిలో వెంటిలేషన్ సరిగ్గా ఉండదు. పైగా అక్కడ గ్యాస్ స్టవ్ మంట, వాటర్ ప్యూరిఫైర్, డిష్ వాషర్ వంటి పరికరాల వల్ల గది ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఫ్రిడ్జ్ కూడా వేడిని విడుదల చేస్తే కిచెన్ రూమ్ అంతా ఓవర్ హీట్ అవుతుంది. అందుకే, దాదాపు 90 శాతం ఫ్రిడ్జ్‌ను వంటగదిలో కాకుండా, గాలి బాగా ఆడే హాల్ లేదా డైనింగ్ ఏరియాలో పెట్టుకోవడం మంచిది.
* ఫ్రిడ్జ్ బ్లాస్ట్‌కు ప్రధాన కారణం…
కిచెన్‌లో రాత్రిపూట ఆహార పదార్థాలు ఉండటంతో ఎలుకల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ ఎలుకలు ఫ్రిడ్జ్ వెనుక వైపు ఉండే ఓపెన్ ప్లేస్‌లోకి దూరి ఫేస్, న్యూట్రల్ వైర్లను కొరుకుతాయి. వైర్లు కట్ అయి ఒకదానికొకటి తగిలినప్పుడు తీవ్రమైన షార్ట్ సర్క్యూట్ సంభవిస్తుంది. ఫ్రిడ్జ్ కింది భాగం ప్లాస్టిక్‌తో నిర్మితమవ్వడం వల్ల ఈ మంటలు వేగంగా అంటుకుంటాయి. దీన్ని సకాలంలో గమనించకపోతే, పక్కనే ఉండే కాపర్ పైపులు కేవలం 20 డిగ్రీల వేడికే ఎర్రగా కాలిపోతాయి. ఆ పైపుల గుండా గ్యాస్ నిరంతరం హై-ప్రెజర్‌తో రన్ అవుతూ ఉండటం వల్ల, ఫ్రిడ్జ్ ఒక్కసారిగా బాంబులా పేలిపోతుంది.
* జాగ్రత్తలు (Quick Safety Tips)…
ఇరుకైన ప్రదేశాలు వద్దు: ఫ్రిడ్జ్‌ను మూసి ఉన్న క్యాబినెట్లలో లేదా సూర్యరశ్మి నేరుగా పడే చోట ఉంచకండి.
ఎలుకల నివారణ: ఫ్రిడ్జ్ వెనుక భాగంలో ఎలుకలు చేరకుండా గ్లూ ప్యాడ్లు లేదా ఎలుకల బోన్లు వాడండి.
రెగ్యులర్ తనిఖీ: ఈ ఎండాకాలంలో ఫ్రిడ్జ్ వైరింగ్‌ను అప్పుడప్పుడు టెక్నీషియన్ చేత తనిఖీ చేయించాలి.
టెంపరేచర్ సెట్టింగ్స్: ఎండల తీవ్రతను బట్టి కూలింగ్ టెంపరేచర్‌ను అడ్జస్ట్ చేస్తూ కంప్రెసర్‌పై లోడ్ తగ్గించాలి.
స్టెబిలైజర్ వాడకం: వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి ఫ్రిడ్జ్ పిసిబి (PCB) బోర్డు పాడవకుండా ఉండటానికి మంచి స్టెబిలైజర్ ఉపయోగించండి.
