Gachibowli Security Guard Arrest
* సెక్యూరిటీ గార్డు అరెస్ట్
Gachibowli| ఆకేరు న్యూస్, హైదరాబాద్: గచ్చిబౌలిలో మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై సెక్యూరిటీ గార్డు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. క్యాబ్ ఎక్కుతున్న సమయంలో మహిళను పక్కకు లాగి ముద్దు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
క్యాబ్ ఎక్కుతుండగా ఘటన
పోలీసుల వివరాల ప్రకారం.. గచ్చిబౌలి పరిధిలోని ఇందిరానగర్‌లో నివసించే 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఆమెను పక్కకు లాగి ముద్దు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
సీసీటీవీ ఆధారంగా అరెస్ట్
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా జార్ఖండ్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు రాజ్‌కుమార్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
