Golla Kuruma Issues
Golla Kuruma Issues| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: గొల్ల, కురుమలు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎన్పీఎస్) ఆధ్వర్యంలో సోమవారం చిల్పూర్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సాదం రమేష్ మాట్లాడుతూ.. గొల్ల, కురుమల ప్రధాన వృత్తి అయిన గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. అయితే ప్రభుత్వం నుంచి తగిన మద్దతు లేకపోవడంతో పెంపకందారులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రధాన డిమాండ్లు
మండలంలోని గొర్రెలు, మేకల సహకార సంఘాలకు పారదర్శకంగా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి.
గొర్రె లేదా మేక మృతిచెందినప్పుడు ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల బీమా పరిహారాన్ని రూ.20 వేలకు పెంచాలి.
ప్రభుత్వ భూములు, చెరువుల శిఖం ప్రాంతాల్లోని తుమ్మ చెట్లను జీవో నంబర్లు 559, 1016 ప్రకారం గొర్రెలు, మేకల సొసైటీలకు కేటాయించాలి.
50 ఏళ్లు దాటిన గొల్ల, కురుమ పెంపకందారులకు నెలకు రూ.5 వేల పింఛన్ మంజూరు చేయాలి.
మండలంలోని పశువైద్యశాలల్లో గొర్రెలు, మేకలకు అవసరమైన వ్యాక్సిన్లు, మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.
తమ డిమాండ్లను అధికారులు పరిశీలించి సానుకూలంగా స్పందించాలని, జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలని రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అపారదాపు రాజు, అపారదాపు రవీందర్, వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు, గొర్రెలు, మేకల పెంపకందారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
