Station Ghanpur
41 రోజుల దీక్ష అనంతరం ప్రత్యేక పూజలు
Station Ghanpur| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు నుంచి సుమారు 30 మంది హనుమాన్ స్వాములు సోమవారం కొండగట్టుకు బయలుదేరారు. 41 రోజుల దీక్షలో ఉన్న స్వాములు స్థానిక ఆంజనేయస్వామి ఆలయం, శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమం నిర్వహించి కొండగట్టుకు పయనమయ్యారు.
ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్, అన్నెపు అనిల్ గురుస్వామి, బూర్ల రమేష్ (చింతపండు), బూర్ల ప్రవీణ్, బూర్ల రమేష్తో పాటు స్వాముల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండగట్టుకు వెళ్తున్న హనుమాన్ స్వాములకు గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
