
* శ్రీశైలం గేట్లు ఎత్తివేత
ఆకేరు న్యూస్, శ్రీశైలం : ఎప్పుడెప్పుడు ఆ జలశయాన్ని సందర్శిద్దామా అని చూసే ప్రకృతి ప్రేమికులు సంతోషం కలిగించే వార్త. శ్రీశైలం (Srisailam) డ్యామ్ గేట్లను మంగళవారం ఎత్తారు. పాలనురగల్లా నీళ్లు ఎగసిపడుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అంతకుముందు ప్రాజెక్టు ఫొటో ఎగ్జిబిషన్‌ను చంద్రబాబు తిలకించారు. ప్రస్తుతం జలాశయంలో 1,71,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 880.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ఇప్పటికే 192 టీఎంసీలు చేరాయి. దీంతో శ్రీశైలం జలాశయంలోని కొన్ని గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. అక్కడకు వెళ్దాం అనుకునే వారు ముందుగానే వెళ్తే మంచిది. వీకెండ్ రోజుల్లో నల్లమల(Nalamala) ఘాట్ రోడ్లలో విపరీతమైన రద్దీ కారణంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.
…………………………………………….