* లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలి.
* మాజీ మంత్రి హరీష్ రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు (HARESHRAO ) అన్నారు. ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం దారుణమని.. అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదన్నారు. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని.. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశ్యం తెలియాలన్నారు. సీఎం వ్యక్తిగత ప్రయోజనాలకోసం చేపడుతున్న భూసేకరణను తక్షణం నిలిపివేయాలని.. పోలిసుల అదుపులో ఉన్న గ్రామస్థులను, రైతులను తక్షణం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
