* మన్మోహన్ సింగ్ మరణవార్తతో మూగబోయిన భారతదేశం
* సంతాపం తెలుపుతున్న రాజకీయ, సినీ, అభిమానులు, ప్రజలు
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: దేశం ఓ దిగ్గజ నాయకుడిని కోల్పోయింది. దేశానికి రెండుసార్లు ప్రధానిగా సేవలు అందించిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను గురువారం సాయంత్రం ఢల్లీిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను ఎయిమ్స్ సంబంధిత వర్గాలు ధృవీకరించాయి. దేశానికి దారి చూపిన ఆర్థిక దిక్సూచి ఇకలేరనే వార్తతో ప్రజలు కన్నీరు పెడుతున్నారు. 1991-96 కాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలను.. 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ మరణంపై రాజకీయ, సినీ, అభిమానులు, ప్రజలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. మన్మోహన్ సింగ్ మరణవార్తతో భారతదేశం మూగబోయింది. అతడి మరణవార్త విని అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రాజకీయ పార్టీలతోపాటు వివిధ రంగాల ప్రముఖులు, దేశ, విదేశీ ప్రతినిధులు సంతాపం తెలిపారు. మన్మోహన్ కుటుంబానికి తీవ్ర సానుభూతి వెలిబుచ్చారు. మన్మోహన్ మరణవార్తతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఢిల్లీకి చేరుకుంటున్నారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
