Station Ghanpur PACS Cooperative
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
అంతర్జాతీయ సహకార వారోత్సవాలు సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సహకార పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. పిఎసిఎస్ అధ్యక్షులు దూదిపాల నరేందర్ రెడ్డి చే సహకార పతాక ఆవిష్కరణ జరిగింది. అనంతరం ఖరీఫ్ సీజన్ యూరియా పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ కు కావలసిన యూరియా సొసైటీ ద్వారా అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దూదిపాల నరేందర్ రెడ్డి, డైరెక్టర్లు చింత ఎల్లయ్య, తోట సత్యనారాయణ, డిసిసి బ్యాంకు మేనేజర్ మహబూబీ, సూపర్వైజర్ సందీప్ సీఈవో మగ్దూం అలీ సిబ్బంది మతీన్ అలీ, రాజు, రాంప్రసాద్, సృజన, సుధాకర్ పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
