Hanamkonda Free Skill Training
* హనుమకొండలో ఉచిత నైపుణ్య శిక్షణ ప్రోగ్రామ్
ఆకేరు న్యూస్, హనుమకొండ:
హనుమకొండ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక నైపుణ్య శిక్షణా కార్యక్రమం ఆగస్టు 18, 2026 న ఉదయం 10:30 గంటలకు హనుమకొండ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐ.టి.ఐ. (ITI) క్యాంపస్ వద్ద ఉన్న MCC స్కిల్ సెంటర్ (జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం) లో ప్రారంభమవుతుంది.
* శిక్షణలో బోధించే ప్రధాన అంశాలు..
కార్పొరేట్ మరియు ఉద్యోగ రంగాల్లో రాణించడానికి అవసరమైన వివిధ నైపుణ్యాలపై అనుభవజ్ఞులైన నిపుణులతో శిక్షణ ఇప్పించనున్నారు.
కోర్సు ఓరియంటేషన్ & కెరీర్ గైడెన్స్
కమ్యూనికేషన్ స్కిల్స్ (సంభాషణ చతురత)
టీమ్‌వర్క్ & ఇంటర్‌పర్సనల్ స్కిల్స్
టైమ్ మేనేజ్మెంట్ & వర్క్ ఎథిక్స్
రెజ్యూమే బిల్డింగ్ & ఇంటర్వ్యూ నైపుణ్యాలు
డిజిటల్ లిటరసీ & ఇంటర్వ్యూ అవగాహన
ఇండస్ట్రియల్ అవగాహన & వర్క్‌ప్లేస్ ఎటికెట్
కస్టమర్ హ్యాండ్లింగ్ & ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్
అర్హతలు…
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీటెక్, డిప్లొమా తదితర విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలనుకునే యువతకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, అర్హులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి కోరారు.
తేది: 18.08.2026 (ఉదయం 10:30 గంటలకు)
స్థలం: MCC స్కిల్ సెంటర్, ములుగు రోడ్, ప్రభుత్వ ఐ.టి.ఐ. క్యాంపస్, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, హనుమకొండ.
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 7893394393

Please tell us what is wrong. Your report will be sent to the website team.
